Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chitti Muthyalu Rice Chicken Pulao : చిట్టి ముత్యాల రైస్‌తో చికెన్ పులావ్‌.. టేస్ట్ అదిరిపోతుందంతే..!

D by D
June 25, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chitti Muthyalu Rice Chicken Pulao : చికెన్ పులావ్.. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది చికెన్ పులావ్ ను ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ పులావ్ ను మనం బాస్మ‌తీ బియ్యం, సాధార‌ణ బియ్యంతో వండుతూ ఉంటాము. వీటితో పాటు చిట్టి ముత్యాల బియ్యంతో కూడా చికెన్ పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. చిట్టి ముత్యాల‌తో చేసే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో కూడా చిట్టి ముత్యాల చికెన్ పులావ్ ల‌భిస్తూ ఉంటుంది. ఈ పులావ్ ను మ‌నం ఇంట్లోకూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవచ్చు. చూడ‌డానికి చిన్న‌గా, ఎంతో చ‌క్క‌గా ఉండే చిట్టి ముత్యాల‌తో పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిట్టి ముత్యాల చికెన్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన చిట్టి ముత్యాల బియ్యం – 3 క‌ప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 4 టీ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్స్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 5, యాల‌కులు – 5, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకులు – 2, నీళ్లు – 6 క‌ప్పులు.

Chitti Muthyalu Rice Chicken Pulao recipe in telugu very tasty
Chitti Muthyalu Rice Chicken Pulao

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – ముప్పావు కిలో, ఉప్పు – 3 టీ స్పూన్స్, కారం – 3 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, చికెన్ మ‌సాలా – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, బిర్యానీ మ‌సాలా – 2 టీ స్పూన్స్, పెరుగు – ఒక క‌ప్పు, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్.

చిట్టి ముత్యాల చికెన్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క‌రివేపాకు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య మధ్య‌లో క‌లుపుతూ 10 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి.

ఇప్పుడు మూత పెట్టి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మ‌రోసారి అంతా క‌లుపుకుని మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి ముత్యాల చికెన్ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో పాటు మ‌సాలా కూర‌ల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chitti Muthyalu Rice Chicken Pulao
Previous Post

Beetroot Pachadi : బీట్‌రూట్‌ను అస‌లు తిన‌లేరా.. అయితే ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Next Post

Pesara Ponganalu : పెస‌ల‌తో పొంగ‌నాల త‌యారీ ఇలా.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్ట‌రు..

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.