Instant Sponge Curd Dosa : మనం అల్పాహారంగా రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. దోశలు చాలారుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం సులభంగా చేసుకోదగిన దోశ వెరైటీలలో పెరుగు దోశ కూడా ఒకటి. ఈ దోశలు స్పాంజ్ లాగా మెత్తగా చాలారుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇన్ స్టాంట్ గా 10 నిమిషాల్లో వీటిని తయారు చేసుకుని తినవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారు, వెరైటీగా తినాలనుకునే వారు ఇలా అప్పటికప్పుడు పెరుగు దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఈ ఇన్ స్టాంట్ కర్డ్ దోశలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ స్పాంజ్ కర్డ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి -ఒక కప్పు, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత.

ఇన్ స్టాంట్ స్పాంజ్ కర్డ్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని దోశ పిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దీనిపై నూనె వేసుకోవాలి. తరువాత గిన్నెతో పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. పిండిని ఒకేసారి వేసుకోవాలి. గిన్నెతో పిండిని రుద్దకూడదు. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ స్పాంజ్ కర్డ్ దోశ తయారవుతుంది. ఈ దోశలను తయారు చేసేటప్పుడు పెనం వేడిగా ఉండేలా చూసుకోవాలి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఉదయం పూట అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా అప్పటికప్పుడు పెరుగుతో దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశలు మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. కనుక వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.