Hotel Style Crispy Dosa : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో దోశలు కూడా ఒకటి. దోశలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం వీటిని ఇంట్లో విరివిరిగా తయారు చేస్తూ ఉంటాము. మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద కూడా ఈ దోశలు లభిస్తూ ఉంటాయి. అయితే హోటల్స్ లో లభించే దోశలు చాలా క్రిస్పీగా, పలుచగా, రుచిగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా, చక్కటి రంగుతో, రుచిగా ఉండే ఈ దోశలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మనం క్రిస్పీ దోశలను తయారు చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ లో క్రిస్పీగా దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు -ఒక కప్పు, రేషన్ బియ్యం లేదా దోశ బియ్యం – 4 కప్పులు, అటుకులు – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్.
క్రిస్పీ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని రెండు నుండి మూడు సార్లు బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరో గిన్నెలో మినపప్పు, మెంతులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండి పట్టడానికి పది నిమిషాల ముందు అటుకులను నానబెట్టుకోవాలి. తరువాత జార్ లో నానబెట్టుకున్న మినపప్పును వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బియ్యాన్ని, అటుకులను వేసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులోనే తగినంత ఉప్పును వేసి పిండి అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పిండిని పులియబెట్టాలి.
పిండి చక్కగా పులిసిన తరువాత తగినంత పిండిని గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసిన పిండిలో తగినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత పెనం మీద నీళ్లు చల్లుకుని టిష్యూ పేపర్ తో లేదా క్లాత్ తో తుడుచుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని పలుచగా దోశలాగా వేసుకోవాలి. ఈ దోశను మధ్యస్థ మంటపై కాల్చుకోవాలి. దోశ తడి ఆరిపోయిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. తరువాత చక్కగా కాలిన తరువాత దానిపై కారం పొడిని చల్లుకోవాలి. లేదంటే ఆలూ మసాలాను ఉంచి ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే దోశ తయారవుతుంది. ఇలా తయారు చేసిన దోశలను ఒకటి ఎక్కువగా తింటారనే చెప్పవచ్చు.