Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Prawns Masala Curry : హోట‌ల్ స్టైల్‌లో ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు..!

D by D
July 30, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Prawns Masala Curry : తిన్న కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే నాన్ వెజ్ వంట‌కాల్లో ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. రొయ్య‌ల‌తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఇలా ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రొయ్య‌ల‌తో చేసే ఇత‌ర వంట‌కాల కంటే ఈ క‌ర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చూస్తేనే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రొయ్య‌లు – పావుకిలో, త‌రిగిన ఉల్లిపాయ – పెద్దది ఒక‌టి, ప‌చ్చిమిర్చి – 4, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు- 8, నూనె – అర క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, కారం -ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు లీట‌ర్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Prawns Masala Curry recipe in telugu make it in hotel style
Prawns Masala Curry

ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా రొయ్య‌ల‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత రొయ్య‌ల‌ను ఒక గంట‌పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. త‌రువాత జార్ లో ఉల్లిపాయ ముక్కలు, ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక రొయ్య‌లు వేసి వేయించాలి. వీటిని 50 శాతం వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. క‌రివేపాకు వేగిన త‌రువాత‌ మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన రొయ్య‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలి కూర ద‌గ్గ‌ర పడే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసుకుని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Prawns Masala Curry
Previous Post

Toothache : దంతాల నొప్పుల‌కు చ‌క్క‌ని ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Next Post

Palak Kofta Curry : రెస్టారెంట్ల‌లో ల‌భించే పాల‌క్ కోఫ్తా క‌ర్రీ.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Related Posts

వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025
lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.