Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Kobbari Pachadi : కొబ్బ‌రి ప‌చ్చ‌డిని ఇలా కార కారంగా ఒక్క‌సారి చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

D by D
August 11, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Kobbari Pachadi : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చికొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌చ్చికొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రిని తీపి వంట‌కాల్లో వాడ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే కొబ్బ‌రి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన ట‌మాటలు – 2, చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10.

Kobbari Pachadi recipe how to make this spicy
Kobbari Pachadi

కొబ్బ‌రి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ప‌చ్చిమిర్చి వేగిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ట‌మాటాలు, చింత‌పండు, కొత్తిమీర వేసి క‌లిపి మూత పెట్టాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు జార్ లో ప‌చ్చిమిర్చి, ప‌చ్చి కొబ్బ‌రి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన ట‌మాటాలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ ప‌చ్చడిని తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకుతోతాళింపు చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రిప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. కూర లేక‌పోయిన‌ప్ప‌టికి ఈ ప‌చ్చ‌డితో క‌డుపు నిండుగా భోజ‌నం చేయ‌వ‌చ్చు. ఈ పచ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్ప‌వ‌చ్చు.

Tags: Kobbari Pachadi
Previous Post

Poha Bites : అటుకుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన పోహా బైట్స్‌.. టేస్ట్ చూస్తే విడిచిపెట్ట‌రు..!

Next Post

Lemon And Ginger For Teeth : అల్లం, నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే.. ఎలాంటి దంతాలు అయినా స‌రే తెల్ల‌గా మారుతాయి..!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.