Tips For Soft Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను కూడా తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. మనలో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇడ్లీఉల మెత్తగా పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటాయి. మెత్తగా, రుచిగా ఉండే ఈ ఇడ్లీలను ఎన్ని తిన్నారో కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా కూడా ఈ ఇడ్లీలను మెత్తగా తయారు చేసుకోలేకపోతూ ఉంటారు. ఇడ్లీలు మెత్తగా ఉంటేనే మరింత రుచిగా ఉంటాయని చెప్పవచ్చు. ఖచ్చితమైన కొలతలతో పాటు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఎవరైనా ఇడ్లీలను మెత్తగా ఉండేలా తయారు చేసుకోవచ్చు. రుచిగా, సాఫ్ట్ గా ఉండేలాఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాఫ్ట్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, ఇడ్లీ రవ్వ – రెండు లేదా రెండున్నర కప్పులు.
సాఫ్ట్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. అలాగే రవ్వను కూడా ఒక గంట పాటు నానబెట్టాలి. పప్పు చక్కగా నానిన తరువాత దీనిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత తగినన్ని చల్లటి నీటిని పోస్తూ పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని ఇందులో రవ్వను వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని పిండిని పులియబెట్టాలి. పిండిని 6 నుండి 8 గంటల పాటు మాత్రమే పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఉప్పు,తగినన్ని నీళ్లు పోసి కలపాలి. పిండిని మరీ ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి.
అలాగే పిండిని ఇడ్లీ ప్లేట్ లల్లో వేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ఇడ్లీ ప్లేట్ లను కుక్కర్ లో మూత పెట్టాలి. ఈ ఇడ్లీలను 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఇడ్లీలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.