Garlic For Men : మనం వంటల్లో విరివిగా వాడే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఎంతో కాలంగా మనం వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉన్నాము. వెల్లుల్లిని వాడడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఆయుర్వేదంలో కూడా ఔషధంగా వెల్లుల్లిని ఉపయోగిస్తూ ఉంటారు. వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మనల్ని ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తాన్ని పలుచగా చేయడంలో మనకు వెల్లుల్లి ఎంతో దోహదపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో ఇన్ ఫ్లామేషన్ తగ్గుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. షుగర్ వ్యాధితో బాధపడే వారు రోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో, శరీరంలో మలినాలనుత తగ్గించడంలో కూడా వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది. అలాగే అల్జీమర్స్, డిమెన్షియా వంటి మెదడు సంబంధిత సమస్యల బారిన పడకుండా కాపాడడంలో అలాగే ఈ సమస్యలను తగ్గించడంలో కూడా వెల్లుల్లి మనకు దోహదపడుతుంది. వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, తలతిరగడం వంటి సమస్యలు దూరమవుతాయి. పెయిన్ కిల్లర్ గా కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది.
అయితే చాలా మంది వెల్లుల్లిని తీసుకోవడం వల్ల పెద్ద పొరపాటు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే వెల్లుల్లిని వంటలల్లో వాడడం వల్ల వేడి చేయడం వల్ల దానిలో ఉండే అల్లిసిన్ నశిస్తుంది. దీంతో వెల్లుల్లిని తీసుకున్నప్పటికి మనకు ఎటువంటి ప్రయోజనం కలగదు. కనుక వెల్లుల్లిని పచ్చిగానే తీసుకోవాలి. వెల్లుల్లిని రెండు రకాలుగా తీసుకోవచ్చు.
రోజూ ఉదయం పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను మింగి నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి లేదా నమిలి మింగాలి. ఇలా తీసుకున్నప్పుడే వెల్లుల్లి వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను మనం పొందగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. పురుషులు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.