Eggs For Hair : గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. గుడ్లలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కేవలం మన ఆరోగ్యానికే కాదు మన జుట్టు ఎదుగుదలలో కూడా గుడ్లు మనకు ఎంతో దోహదపడతాయి. మనం అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టును అందంగా, కాంతివంతంగా, పొడవుగా ఉంచుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో లభించే అన్ని రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయినా ఎటువంటి ఫలితం లేక మనలో చాలా వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు.
జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు గుడ్లను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డుతో ఒక చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల పొడవైన, ఒత్తైన జుట్టు మన సొంతమవుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరిచే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొనను తీసుకోవాలి. తరువాత తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, చిటికెడు పంచదార, ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు పట్టించాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టేలా దువ్వెనతో 7 నుండి 8 సార్లు బాగా దువ్వాలి.
దీనిని తడి ఆరే వరకు అలాగే ఉంచి తలస్నానం చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించే ముందు జుట్టుకు నూనె లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు అందుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా, కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా కోడిగుడ్డును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.