Upma : మనం ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో ఉప్మా కూడా ఒకటి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఉప్మాను తయారు చేయడం చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్సలు నచ్చదనే చెప్పవచ్చు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో తయారు చేసే ఉప్మాను మాత్రం తినరు. అలాగే మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద అనేక రకాల టిఫిన్స్ దొరుకుతాయి కానీ ఉప్మా మాత్రం దొరకదు. ఎందుకంటే చాలా మంది దీనిని తినడానికే కాదు కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు.
కానీ ఉప్మాను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనలో చాలా మందికి తెలియదు. ఉప్మాను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఉప్మాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తక్కువ నూనెతో తయారు చేస్తారు కనుక ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. అదే విధంగా ఉప్మాలో పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు వంటి వాటిని వేసి తయారు చేస్తారు. కనుక ఉప్మాను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింతగా మేలు కలుగుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఉప్మా ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు.
ఉప్మాలో క్యారెట్, బీన్స్, బఠాణీ, టమాట వంటి కూరగాయ ముక్కలు, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు వంటి వాటిని కూడా వేస్తాము. కనుక ఉప్మాను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా ఉప్మా మనకు దోహదపడుతుంది. ఈ విధంగా ఉప్మా కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.