Egg Yolk : ప్రోటీన్ ఎక్కువగాఉండే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. గుడ్డును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నిపుణులు కూడా రోజూ ఒక గుడ్డును ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. గుడ్డును తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు లభిస్తాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో గుడ్డు మనకు దోహదపడుతుంది. అయితే మనలో చాలా మంది కోడిగుడ్డు తెల్లసొనను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. గుడ్డు పచ్చసొనను తీసుకోవడ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చాలా మంది పచ్చసొనను తీసుకోవడం మానేస్తున్నారు. గుడ్డు పచ్చసొనను ఆహారంగా తీసుకునే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. కానీ నిపుణులు మాత్రం కోడిగుడ్డు పచ్చసొనను కూడా ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు.
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికి దానిని తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదని వారు చెబుతున్నారు. పూర్తి గుడ్డును తీసుకున్నప్పుడే మన శరీరానికి సంపూర్ణ పోషకాలు అందుతాయని వారు చెబుతున్నారు. గుడ్డు పచ్చసొనలో కూడా ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. గుడ్డు తెల్లసొనలో కంటే పచ్చసొనలో పోషకాలు అధికంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ, కె, బి6, బి12, క్యాల్షియం, జింక్, రైబోప్లేవిన్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. గుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. పిల్లలల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడతాయి.
గర్బిణీ స్త్రీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ గుడ్డు పచ్చసొనలో ఎక్కువగా ఉంటుంది. కనుక గర్బిణీ స్త్రీలు గుడ్డు పచ్చసొనను కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా గుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని పచ్చసొనను తీసుకున్నప్పుడే మనం సంపూర్ణ పోషకాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వారు మాత్రం గుడ్డు పచ్చసొనను తీసుకోకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.