Lemon Water Health Benefits : లెమన్ వాటర్.. మనలో చాలా మంది రోజూ లెమన్ వాటర్ ను తాగుతూ ఉంటారు. ఒక గ్లాస్ సాధారణ నీటిలో లేదా గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటూ ఉంటారు. అలాగే కొందరు రుచి కొరకు ఇందులో తేనెను కూడా వేసుకుంటారు. అయితే చాలా మంది లెమన్ వాటర్ ను తాగడం వల్ల బరువు మాత్రమే తగ్గుతారని భావిస్తున్నారు. బరువు తగ్గాలనుకున్న వారే లెమన్ వాటర్ ను తాగాలని భావిస్తూ ఉంటారు. కానీ లెమన్ వాటర్ ను తాగడం వల్ల మనం బరువు తగ్గడంతో పాటు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. లెమనం వాటర్ ను తాగడంవల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లెమన్ వాటర్ ను తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
లెమన్ వాటర్ ను తాగడం వల్ల దీనిలో ఉండే విటమిన్ సి కారణంగా శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ నశిస్తాయి. తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడే వారు లెమన్ వాటర్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే లెమన్ వాటర్ ను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. మలబద్దకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. లెమన్ వాటర్ ను తాగడం వల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రోజూ లెమన్ వాటర్ ను తాగడం వల్ల శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. అలాగే లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల మనం ఉత్సాహంగా పని చేసుకోవచ్చు.
నీరసం, బలహీనత వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొటిముల, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం బిగుతుగా తయారవుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే రోజూ లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి జబ్బుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. లెమన్ వాటర్ ను తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా లెమన్ వాటర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కేవలం బరువు తగ్గాలనుకునే వారేకాకుండా ప్రతి ఒక్కరు కూడా లెమన్ వాటర్ ను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.