Green Tea Vs Black Tea : మనలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్దతో అనేక రకాల పానీయాలను తీసుకుంటూ ఉంటారు. వాటిలో గ్రీన్ టీ, బ్లాక్ టీ కూడా ఒకటి. ఇవి రెండు కూడా వివిధ రుచులను కలిగి ఉంటాయి. అలాగే ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ లో దేనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. వీటిలో దేనిని తీసుకోవడం వల్ల మనకు అధిక ప్రయోజనాలు కలుగుతాయి… దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా కాపాడడంలో, శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో గ్రీన్ టీ మనకు ఎంతో సహాయపడుతుంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో జీవక్రియల రేటును పెంచి బరువు తగ్గేలా చేయడంలో కూడా గ్రీన్ టీ మనకు దోహదపడుతుంది. శరీరాన్ని చురుకుగా ఉంచడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గ్రీన్ టీ మనకు సహాయపడుతుంది. దీనిలో కెఫిన్ స్థాయిలు ఉన్నప్పటికి బ్లాక్ టీ కంటే తక్కువగా ఇందులో కెఫిన్ స్థాయిలు ఉంటాయి.
అలాగే బ్లాక్ టీని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ టీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. బ్లాక్ టీ తాగడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్లాక్ టీని తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు గుళ్లబారకుండా ఉంటాయి. అయితే బ్లాక్ టీ లో గ్రీన్ టీ కంటే ఎక్కువ కెఫిన్ ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో దేనిని తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతాయని చక్కటి ఆరోగ్యం కోసం ఇవి రెండింటిని కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.