Foods To Eat After Fever : మనలో చాలా మంది తరుచూ జ్వరంతో బాధపడుతూ ఉంటారు. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల, వాతావరణ మార్పుల కారణంగా ఇలా జ్వరం బారిన పడుతూ ఉంటారు. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. జ్వరంతో బాధపడేటప్పుడు జ్వరం తగ్గడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో జ్వరం తగ్గిన తరువాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహార విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. జ్వరం కారణంగా శరీరం కోల్పోయిన పోషకాలను, శక్తిని తిరిగి శరీరానికి అందించడం చాలా అవసరం. జ్వరం తగ్గిన తరువాత త్వరగా జీర్ణమయ్యే ఆహారాలతో పాటు శక్తిని ఇచ్చే ఆహారాలను కూడా తీసుకోవాలి. జ్వరం తగ్గిన తరువాత కిచిడీని తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అందడంతో పాటు త్వరగా జీర్ణమవుతుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత పెరుగును తీసుకోవాలి.
ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే వెజిటేబుల్ దాలియాను కూడా తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవ్వడంతో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా శరీరానికి లభిస్తాయి. ఇక జ్వరం తగ్గిన తరువాత దాల్ సూప్ ను తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత బలం చేకూరుతుంది. అలాగే కొబ్బరి నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత అరటిపండ్లను తీసుకోవాలి. ఇవి త్వరగా జీర్ణమవ్వడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే దానిమ్మ గింజలను తీసుకోవాలి.
అలాగే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఉండే అల్లంతో టీని తయారు చేసి తీసుకోవాలి. వీటితో పాటు శరీరానికి పోషకాలు అందేలా, శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా వెజిటేబుల్ సూప్ ను తీసుకోవాలి. అలాగే జ్వరం తగ్గిన తరువాత ఆహారంలో భాగంగా కరివేపాకును తీసుకోవాలి. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. జ్వరం తగ్గిన తరువాత ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం మరింత త్వరగా కోలుకోవచ్చని జ్వరం వల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.