Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Paneer Masala : ట‌మాటా ప‌నీర్ మ‌సాలా త‌యారీ ఇలా.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
December 1, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Paneer Masala : ట‌మాట ప‌నీర్ మ‌సాలా.. ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ప‌నీర్, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఇంట్లో ప‌నీర్ ఉంటే చాలు ఈ క‌ర్రీని చిటికెలో తయారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ట‌మాట పనీర్ మ‌సాలాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ప‌నీర్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ప‌ల్లీలు – 4, ఖర్బూజ గింజ‌లు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బ‌రి పొడి – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ట‌మాటాలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ట‌మాటాలు – 3, నీళ్లు – 150 ఎమ్ ఎల్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ప‌నీర్ క్యూబ్స్ – పావుకిలో, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Paneer Masala recipe in telugu make in this way
Tomato Paneer Masala

ట‌మాట ప‌నీర్ మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి స‌గానికి పైగా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, ప‌ల్లీలు, ఖ‌ర్బూజ గింజ‌లు వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత ఎండుకొబ్బ‌రి పొడి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే 3 ట‌మాటాల‌ను కూడా ఫ్యూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో పావు క‌ప్పు నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత టమాట ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌రకు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, నీళ్లు, నెయ్యి వేసి క‌ల‌పాలి. దీనిని కూడా నూనెపైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ప‌నీర్ ముక్క‌లు, వేయించిన ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌నీర్ మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని బ‌గారా అన్నం, జీరా రైస్, చ‌పాతీ, రోటీ, నాన్, పూరీ, దోశ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

Tags: Tomato Paneer Masala
Previous Post

Oats Pongal : ఎంతో రుచిక‌ర‌మైన ఓట్స్ పొంగ‌ల్ త‌యారీ ఇలా.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Next Post

Foods To Eat After Fever : జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిందా.. అయితే త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ 10 ఆహారాల‌ను తినండి..!

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!