Carrots For Diabetics : క్యారెట్ ను కూడా మన ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇందులో అనేక రకాల పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్స్ తీపి రుచిని కలిగి ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే క్యారెట్స్ తియ్యగా ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తుల్లో షుగర్ మరింతగా పెరుగుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. షుగర్ వ్యాధి గ్రస్తులు క్యారెట్స్ ను తీసుకోకపోవడమే మంచిదని చెబుతూ ఉంటారు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు నిజంగా క్యారెట్ ను తీసుకోకకూడదా.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్స్ తియ్యగా ఉన్నప్పటికి షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందని షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని ఆహారంగా భాగంగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి క్యారెట్స్ 16 జిఐ ని ఉడికించిన క్యారెట్స్ 32 నుండి 49 వరకు జిఐని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని వారు చెబుతున్నారు. అలాగే వీటిలో షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయని కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు క్యారెట్ ను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడంతో పాటు మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీర బరువు సులభంగా తగ్గవచ్చు. ఈ విధంగా క్యారెట్ షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని దీనిని పచ్చిగా, ఉడికించి తీసుకోవచ్చని అలాగే వంటలల్లో లేదా సూప్ గా, జ్యూస్ గా చేసి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏ విధంగా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు క్యారెట్స్ ఎంతో మేలు చేస్తాయని వారు చెబుతున్నారు.