Drinking Water Tips : మన శరీరానికి నీరు చాలా అవసరం. నీరు లేనిదే మనం జీవించడం చాలా కష్టం. రోజుకు మనం 3 నుండి 4 లీటర్ల నీటిని తాగాలి. నీటిని అనేక విధాలుగా మనం తాగుతూ ఉంటాము. మనలో చాలా మంది నీటిని నిలబడి తాగుతూ ఉంటారు. అయితే నీటిని నిలబడి తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నీటిని నిలబడి తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. నీరు మన శరీరానికి అవసరమే అయినప్పటికి నీటిని ఎలా తాగుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఉరుకుల పరుగుల జీవితం కారణంగా చాలా మంది నిలబడి గబగబా నీటిని తాగేస్తూ ఉంటారు. ఇలా నిలబడి నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. అంతేకాకుండా ఆహారం, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది. ఇది మన గుండెపైన, ఊపిరితిత్తుల తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిలబడి నీటిని తాగడం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరుగుతుంది. కడుపు దిగువ భాగంలోని గోడలపై ఒత్తిడి పడుతుంది. ఇది హెర్నియాకు దారి తీసే అవకాశం ఉంది. అంతేకాకుండా నిలబడి నీటిని తాగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నాడీ వ్యవస్థపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే నిలబడి నీటిని తాగడం వల్ల కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది.
దీంతో మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా నిలబడం నీరు తాగడం మూత్రపిండాలపై కూడా ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే నీటిని నిలబడి తాగడం వల్ల అవి వడకట్టకుండానే పొత్తి కడుపు వైపు వెళ్తాయి. దీంతో నీటిలో ఉండే మలినాలు పిత్తాశయంలో నిక్షిప్తం చేయబడతాయి. దీంతో మూత్రాశయ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక నీటిని నిలబడి తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.