Non Dairy Foods For Strong Bones : మన శరీరానికి సరైన ఆకృతిని ఇవ్వడంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎముకలు ధృడంగా ఉండాలంటే మనం తగినంత క్యాల్షియం తీసుకోవడం చాలా అవసరం. తగినంత క్యాల్షియం శరీరానికి అందకపోతే ఎముకలు గుళ్లబారతాయి. కీళ్లనొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక రోజూ తగినంత క్యాల్షియం తీసుకోవడం చాలా అవసరం. మన శరీరానికి రోజుకు 700 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. అయితే ఎముకలు ధృడంగా ఉండాలన్నా, క్యాల్షియం అందాలన్నా పాలు తాగితే సరిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ పాల కంటే కూడా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకున్నా కూడా తగినంత క్యాల్షియం అందుతుంది. అలాగే ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. ఎముకలను ధృడంగా మార్చడంతో పాటు క్యాల్షియం ఉండే ఇతర ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నగా ఉండే చియా విత్తనాలల్లో క్యాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. 100గ్రాముల చియా విత్తనాల్లో 631 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోయాబీన్స్ కూడా క్యాల్షియాన్ని కలిగి ఉంటాయి. 100గ్రాముల సోయాబీన్స్ గింజల్లో 277మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. రాజ్మా గింజల్లో కూడా క్యాల్షియం ఉంటుంది. 100గ్రాముల రాజ్మా గింజల్లో 143 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలతో పాటు శరీరానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే పొద్దుతిరుగుడు గింజల్లో కూడా క్యాల్షియం ఉంటుంది. 100గ్రాముల పొద్దుతిరుగుడు గింజల్లో 78 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. బచ్చలికూరను తీసుకోవడం వల్ల కూడా మన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 100 గ్రాముల బచ్చలికూరలో 99మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. బచ్చలికూరను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. మన ఆహారంలో భాగంగా బ్రోకలిని తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం లభిస్తుంది. 100 గ్రాముల బ్రోకలిలో 47 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అలాగే గుడ్డులో కూడా క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాముల గుడ్డులో 50మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలతో పాటు శరీరానికి కూడా మేలు కలుగుతుంది. బాదంపప్పు కూడా మన ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 30గ్రాముల బాదంపప్పును తీసుకోవడం వల్ల 80 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అలాగే అందరూ ఎంతో ఇష్టంగా తినే బెండకాయలల్లో కూడా క్యాల్షియం ఉంటుంది. ఒక కప్పు బెండకాయలో 88 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇక నారింజ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనం క్యాల్షియాన్ని పొందవచ్చు. 100గ్రాముల నారింజ పండ్లల్లో 40మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఈ విధంగా మన ఆహారంలో భాగంగా ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు తగినంత క్యాల్షియం లభిస్తుంది. దీంతో మన ఎముకలు ధృడంగా తయారవుతాయి.