Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

Virat Kohli : 147 ఏళ్ల చ‌రిత్ర‌లో తొలిసారి.. స‌రికొత్త రికార్డ్ బ్రేక్ చేయ‌బోతున్న విరాట్ కోహ్లీ..

Sam by Sam
September 14, 2024
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కి ఎన్నో సేవ‌లు చేశారు. కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించారు. క్రికెట్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ నెల‌కొల్పిన రికార్డ్‌లు ఎవ‌రు బ్రేక్ చేస్తారా అని ఇన్నాళ్లు అంతా ఎదురు చూడ‌గా, వాటిలో కొన్ని ఇప్ప‌టికే బ్రేక్ అయ్యాయి. మ‌రికొన్ని మాత్రం ఎప్ప‌టికీ ప‌దిలంగా ఉండేలా ఉన్నాయి. అందులో 100 అంత‌ర్జాతీయ శ‌త‌కాలు. వ‌ర్తమాన క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ మాత్ర‌మే 80 సెంచ‌రీల‌తో స‌చిన్ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. 35 ఏళ్ల విరాట్ ఫిట్‌గా ఉంటే మ‌రో రెండుమూడేళ్లు క్రికెట్‌లో కొన‌సాగుతాడు. పైగా ఇప్ప‌టికే టీ20ల‌కు గుడ్‌బై చెప్పేశాడు. వ‌న్డే, టెస్టు ఫార్మాట్‌లు మాత్ర‌మే ఆడ‌తాడు. మిగ‌తా 20 శ‌త‌కాలు ఈ రెండు ఫార్మాట్ల ద్వారా చేయాల్సి ఉంటుంది.

బంగ్లాదేశ్ సిరీస్​తో దాదాపు 9 నెలల విరామం తర్వాత టెస్టుల్లో బరిలో దిగనున్నాడు. అయితే ఈ సిరీస్​లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డుపై విరాట్ కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి అది ఏంటంటే? 35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్​ల్లో 26942 పరుగులు చేశాడు. 27 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు విరాట్ మరో 58 రన్స్​ దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలో రానున్న బంగ్లా టెస్టు సిరీస్​లో విరాట్ ఫీట్ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్​లో అత్యంత వేగంగా 27వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్​గా నిలుస్తాడు.

Virat Kohli set to break another record of sachin tendulkar
Virat Kohli

ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ (623 ఇన్నింగ్స్​) పేరిట ఉంది. అయితే విరాట్ ఈ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక గతంలోనూ 16,000, 17,000, 18,000, 19,000, 20,000, 21,000, 22,000, 23,000, 24,000, 25,000, 26,000 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా ఉందుకున్న రికార్డు సైతం విరాట్ పేరిటే ఉంది. విరాట్ ఈ ఫీట్ అందుకుంటే, ఇంటర్నేషనల్ క్రికెట్​లో 27 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్​గా నిలుస్తాడు. ఈ లిస్ట్​లో సచిన్ తెందూల్కర్ (34357) టాప్​లో ఉండగా కుమార సంగక్కర, రికీ పాంటింగ్​ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.

Tags: Virat Kohli
Previous Post

Whiteland Virus : చైనాలో మ‌రో ప్రాణాంత‌క వైర‌స్ విజృంభ‌ణ‌..!

Next Post

Illia Yehfimchyk : 36 ఏళ్ల వ‌య‌స్సులో క‌న్నుమూసిన భ‌యంక‌ర‌మైన బాడీ బిల్డ‌ర్

Related Posts

ఆధ్యాత్మికం

చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?

June 12, 2025
Home Tips

ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండాలంటే.. సింపుల్ చిట్కాలు..!!

June 12, 2025
వినోదం

అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?

June 12, 2025
వినోదం

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

June 12, 2025
lifestyle

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

June 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!