ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన ఫొటోలు వదిలి మరోసారి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ.
ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సరికొత్త ఔట్ పిట్లు ధరిస్తూ.. తన తన అందమైన, అద్భుతమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. అయితే కృతి చర్మం కొరియన్‌లా కనిపించడానికి అసలు కారణం బయటపెట్టింది. చదవుకునే రోజుల్లో పుస్తకాల షాపుకి వెళ్లా. అప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని హౌ టూ బీ గార్జియస్ అనే బుక్ కొన్నాను. ఆ సమయంలో మా అమ్మ పుస్తకం కొనడంతో సంతోషించింది. ఇక ఆ రోజు నుండి పుస్తకంలో చెప్పిన మాదిరిగా ఉదయాన్నేసన్‌స్క్రీన్ అప్లై చేసుకున్నా. షుగర్‌ని విడిచిపెట్టినప్పటి నుండి శరీరంలో అనేక మార్పులు గమనించడం చూశా. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకి స్పూర్తి అని, ఆమె ఆత్మ విశ్వాసం నాకు చాలా ఇష్టం అంటూ కృతి పేర్కొంది.
డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం మూవీ ఏఆర్ఎం మీద గంపెడాశలు పెట్టుకుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మూడు తరాలు దొంగతనం చేసే హీరోని ట్రిపుల్ రోల్ లో చూపించిన ప్రయోగం ఆశించిన ఫలితం ఇస్తున్నట్టు కనిపించడం లేదు. సబ్జెక్టు పరంగా కొన్ని ప్రశంసలు దక్కినా అసలు కంటెంట్ ని నడిపించడంలో దర్శకుడు చూపించిన తడబాటు విఫలమైందని వసూళ్లు చెబుతున్నాయి. ఈ చిత్రం అద్భుతాలు సృష్టించే స్థాయిలో లేదనేది వాస్తవం. ఒకవేళ తెలుగులో ఇది హిట్ అయితే కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుందనే ఆశతో ఉన్న కృతి శెట్టి అది నెరవేరేలా కనిపించడం లేదు.