Heart Attack Symptoms : మన శరీరంలో గుండెకి ఉన్న ప్రాధాన్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది.సెకనులో వచ్చే గుండెపోటు మనిషి ప్రాణాలను తీస్తుంది. గుండెపోటు సంభవించడానికి ముందు కొన్ని సంకేతాలు కనపడతాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. సాధారణంగా ఛాతీలో నొప్పి రావడంతోపాటు అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడంలాంటివి గుండెపోటుకు కారణాలయ్యే అవకాశం ఉంది. కొంతమందికి గ్యాస్ట్రిక్, అసిడిటీ వల్ల కడుపు నొప్పి వస్తుంది. కడుపు మధ్య భాగంలో సంభవించే మంట, వచ్చే నొప్పి గుండెజబ్బులకు కారణమవుతాయి.
అయితే ముఖ్యమైన కారణాలు ఏంటంటే.. అరిథ్మియా. సాధారణ పదాలలో కార్డియాక్ అరిథ్మియా అంటే గుండె వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకోవటం. అరిథ్మియా అనేది అసాధారణమైన గుండె లయకు సంబంధించినది. సాధారణంగా హృదయ స్పందన 60-100 మధ్య ఉంటుంది. అంతకన్నా తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అసాధారణ పరిస్ధితిగా పరిగణించవచ్చు. హృదయం అనేది లయబద్ధంగా పనిచేసే ఒక నిర్దిష్ట అవయవం, ఏదైనా నాన్-రిథమిక్ కార్యకలాపాలు గుండెతో ప్రతిదీ సరిగ్గా లేదనడానికి సంకేతం. కొన్ని హార్ట్ అరిథ్మియాలు ప్రమాదకరం కాదు, అయితే కొన్ని అరిథ్మియాలు ప్రాణాంతకం కావచ్చు. మరియు స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావచ్చు.ఇక టిన్నిటస్ కూడా గుండె సమస్యకి సంకేతం కావచ్చు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద రక్తనాళాలు అయిన కరోటిడ్ ధమనుల సంకుచితం వలన ధమని గోడల లోపల కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దాని వలన స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
నడుస్తున్నప్పుడు కాళ్లలో ఎక్కువగా నొప్పి వచ్చిన నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఎక్కువ దూరం నడవలేకపోతే , కాళ్ళలో నొప్పితో కూడిన తిమ్మిర్లు అనిపిస్తే, నిర్లక్ష్యం చేయవద్దు .మీ హృదయనాళ వ్యవస్థకు అనుసంధానించబడిన మీ కాళ్ళలోని ధమనులు ఇలా సంకేతాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అజీర్ణం కూడా గుండెపోటు యొక్క ప్రారంభ లక్షణంగా చెబుతుంటారు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇక అకస్మాత్తుగా తల తిరగడం, వాంతులు, వికారంగా అనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కూడా గుండెపోటుకు ప్రాథమిక లక్షణాలుగా చెబుతున్నారు.