మొక్కజొన్నా.. నీ మేలు మరవలేనిది. నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నీగురించి తెలిసాక సర్వ ఔషధాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది. ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు. ఐలవ్ యూ స్వీట్ హాట్.. స్వీట్ కార్న్.. ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా.. ఇందులో ఉన్న ఔషధ గుణాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు తెచ్చుకుంటారు.
అవును, మొక్కజొన్నలతో కలిగే లాభాలు అన్నీఇన్నీ కావు. చాలా దీర్ఘ కాలిక వ్యాధులకు అమృత ఔషధంలా పనిచేస్తుంది. మనకు తెలిసి మొక్కజొన్నను కాల్చుకొని తింటాం, ఉడకబెట్టుకొని తింటాం, మహా అయితే కార్న్ ఫ్రై, పాప్ కార్న్ మనకు తెలిసినవి. ఇవి మాత్రమే. తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో చాలా ఔషధాల్లో, తినుబండారాల్లో, విస్కీల్లో, పౌడర్లలో, ఇంకా చాలా వరకు తయారీల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఔషధాల్లో మొక్కజొన్న పాత్ర కీలకమైనది.
కార్న్ లో ఉన్నటువంటి లూటెయిన్, జియాజాంతిన్ అనే పోషకాలు మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లేవిన్, ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. మొక్కజొన్న వలన మధుమేహం, రక్తహీనత, జీర్ణ సమస్యలు, మలబద్దకం, కొలెస్ట్రాల్, మూత్రపిండాల సమస్యలు.. ఇలా ఎన్నో ధీర్ఘ కాలిక వ్యాదులను నియంత్రించడంలో మొక్కజొన్న దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ప్రపంచంలో 4వ స్థానానికి మొక్కజొన్న పంట చేరుకుందంటే దీని ప్రత్యేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంకేంటి మరి.. మొక్క జొన్న పొత్తులు మార్కెట్ లో దొరికే సీజన్.. వెళ్లండి సంచులు పట్టుకొని మార్కెట్ కు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.