ఈ రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్, పాన్ కార్డ్ తప్పనిసరి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇవి కలిగి ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవలి కాలంలో భారతీయులు సున్నితమైన సమాచారం కొన్ని వెబ్ సైట్స్ లీక్ చేస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ విషయాన్ని గుర్తించాయి. ఇండియన్ సిటిజన్స్ ఆధార్, పాన్ కార్డ్ వివరాలతో పాటు సెన్సిటివ్ డేటా బహిర్గతం చేస్తోంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనింది. వాటిని ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు అధికార ప్రకటనలో తెలిపింది.
ఆధార్ సమాచారాన్ని బహిరంగంగా ప్రధార్శించడంపై ఆధార్ యూఐడీఏఐ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ వెబ్ సైట్‌ల అనాలసిస్ ప్రకారం కొన్ని భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపింది. సంబంధింత వెబ్ సైట్ యజమానులకి ప్రజల ప్రైవసీ దెబ్బతినకుండా తీసుకోవల్సిన చర్చలపై ఐసీటీ గైడ్ లైన్స్ పంపింది. సబంధిత వెబ్ సైట్ యజమానులకి ప్రజల ప్రవైసీ దెబ్బతినకుండా తీసుకోవల్సిన చర్యలపై ఐసీటీ గైడ్ లైన్స్ పంపింది. ఐటీ చట్టం ప్రకాంర నడుచుకోవాలని సీఈఆర్‌టీ-ఇన్ వెబ్ సైట్లకి సూచించింది.
పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వ్యక్తుల కీలక సమాచారం కొన్ని వైబ్ సైట్స్ ఇతరులకి చూపిస్తున్నాయి. గత వారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అధికారులు 3.1 కొట్ల మంది వినియోగదారుల డేటాని విక్రయించారని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ పేర్కొన్నర్ విషయం తెలిసిందే. భారత పౌరుల ఆధార్ కార్డ్ మరియు పాన్ వివరాలతో సహా కొన్ని వెబ్‌సైట్‌లు సున్నితమైన గుర్తించదగిన సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది .వెబ్‌సైట్‌లు ఆధార్‌లోని సెక్షన్ 29(4)ని ఉల్లంఘిస్తున్నందున UIDAI చర్య ప్రారంభించింది.