నెయ్యిని ప్రతి ఒక్కరు తమ వంటకాలలో కామన్‌గా ఉపయోగిస్తుంటారు. నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యిని రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉండగలరు. నెయ్యి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలుసు.నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కానీ మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి వాతా, పిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు A, E మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీన్ని రోజూ తాగడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్‌ల స్రావం పెరుగుతుంది. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి అంతర్గత శరీరాన్ని శుభ్రపరచడం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు.
చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. బవాడిపోయిన, పొడిబారిన చర్మం కలవారు ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగుతుంటే చర్మం మృదువుగా ఉంటుంది.కీళ్ల నొప్పులతో బాధపడేవారు నెయ్యి కలిపిన గోరువెచ్చని నీరు తాగితే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. నీళ్లలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది.