Viral Video : సినిమా పాటలు అంటే చాలా మందికి ఇష్టమే. ఇష్టమైన పాట వస్తే చేస్తున్న పనిని కూడా ఆపి ఆ పాటను వింటుంటారు. టీవీల్లో పాటలు వస్తే కళ్లప్పగించి చూస్తుంటారు. ఇష్టమైన పాటలను కొందరు కూనిరాగాలు కూడా తీస్తుంటారు. అయితే ఇలా పాటలు చూసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇదిగో ఈ యువతికి జరిగినట్లే జరుగుతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఓ యువతి ఇంట్లో ఫ్లోర్‌ను నీటితో తుడుస్తూ.. టీవీలో వస్తున్న పాటకు దృష్టి మరల్చింది. దీంతో ఫ్లోర్‌ను తుడుస్తున్నానన్న విషయం కూడా మరిచిపోయింది. ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఫ్లోర్ తడిగా ఉంది కనుక ఆమె డ్యాన్స్‌కు కాలు జారింది. దీంతో నేలపై బొక్క బోర్లా పడింది. అయితే ఆ తరువాత ఏం జరిగింది.. అన్న విషయం తెలియదు. కానీ అదే సమయంలో ఈ సంఘటనను వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.
పాటలు అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. అయితే టీవీలో ఇష్టమైన పాట వస్తే మనం చేసే పని ఏంటి.. అనేదాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే ఇలా జరుగుతుంది.. అని నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
#girl fallen on floor while dancing #viralvideo pic.twitter.com/W6m2CPHJ1f
— India Daily Live (@IndiaDailyLive) May 27, 2022