Sabja Seeds : సబ్జా గింజల గురించి అందరికీ తెలిసిన విషయమే. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వేసవి కాలం వస్తుంది అంటే చాలామంది సబ్జా గింజలను నీటిలో నానబెట్టి కాస్త బెల్లం లేదా చక్కెర కలుపుకుని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో చలువ చేస్తుందని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇవి కేవలం శరీరానికి చల్లదనం అందించడమే కాకుండా వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే..
* సబ్జా గింజలు కాస్త తేమ తగిలితేనే అవి ఉబ్బి పోతాయి. కనుక మన రోజువారీ ఆహారంలో భాగంగా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల కొన్ని గింజలను తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కనుక ఇవి అధిక బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
* ఈ గింజలలో ఉన్న ఔషధ గుణాల వల్ల మల, మూత్ర సమస్యలను తగ్గించుకోవచ్చు. మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
* మన శరీరంపై ఏదైనా గాయాలు తగిలినప్పుడు సబ్జా గింజలను బాగా నూనె వేసి నూరి తగిలిన గాయాలపై ఈ మిశ్రమం రాయడం వల్ల త్వరగా గాయాలు నయమవుతాయి.
* అధిక ఆందోళన, తీవ్రమైన తలనొప్పి ఉన్నవారు ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి కాస్త చక్కెర వేసుకొని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.
* క్రీడాకారులు బాగా నీరసించి పోయినప్పుడు ఈ సబ్జా గింజల నీటిని తాగటం వల్ల త్వరగా శక్తి వస్తుంది. మళ్లీ ఉత్సాహంగా పనిచేయవచ్చు.
* గొంతులో మంట, దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టుకుని తినటం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
* బాక్టీరియా సంబంధిత వ్యాధులను నయం చేయడానికి సబ్జా గింజలు ఎంతో దోహదపడతాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల బాక్టీరియా సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు.