ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైఖేల్ డి నోస్ట్రడామస్ 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు. ఈయన చెప్పిన అంచనాలన్నీ నిజమయ్యాయి. అయితే ఈయనా 2024, 2025 కు సంబంధించిన ప్రెడిక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇంకొక మూడు నెలల్లో 2025 ప్రారంభం అవుతుంది. 2024 లో ఏ విధంగా అయితే అంచనాలన్నీ నిజమయ్యాయో 2025 లో కూడా అదే జరుగుతుందని చాలా మంది నమ్ముతున్నారు.
ఈయన రాసిన అంచనాలన్నీ నిజమైతే ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసమే తప్పదు అని అంటున్నారు. అతను పుస్తకంలో రాసిన అంచనాలన్నీ అలంకారికా భాషలో ఉంటాయి, అర్థం కావడానికి చాలా కష్టం అవుతుంది. ఈయన ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలు గురించి ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటి పై ఎన్నో అంచనాలు చేశారు పైగా అవన్నీ నిజమయ్యాయి.
తాజాగా ఇరాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రపంచ యుద్ధ ముప్పును పెంచాయి. మూడో ప్రపంచ యుద్ధం 2024 లో ప్రారంభం అవుతుందని ఈయన పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన 79 ఏళ్ల తర్వాత ఇంకొక ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని అన్నారు. అది నిజమవుతుందా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం యుద్ధాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలు గురించి కూడా ఎన్నో అంచనాలు చేయడం జరిగింది. దీన్ని బట్టి నవంబర్ లో అమెరికాలో జరిగే ఎన్నికలలో అధికారం మారుతుందని పేర్కొన్నారు.