మంచి ఆరోగ్యానికి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎంతో అవసరం అని అందరికి తెలిసినదే. అందుకోసం చాలా మంది వీటిని తరచుగా రోజు వారి ఆహరం లో తీసుకుంటూ ఉంటారు. ఆకుకూరలలో పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కాకపోతే దీనిని ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో జాయింట్ పెయింట్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన విధంగా కంట్రోల్ చేయకపోతే కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిలో విటమిన్ ఏ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తున్న పాలకూర ను ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే అని నిపుణులు చెప్తున్నారు.
పాలకూర లో ఫైబర్ కూడా ఎంతో పుష్కలంగా ఉంటుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే కాన్స్టిపేషన్, గ్యాస్, కడుపునొప్పి, బ్లోటింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికైతే కిడ్నీకి సంబందించిన సమస్యలు ఉన్నాయో వారు పాలకూర తీసుకోకపోవడమే మేలు అని నిప్పులు అంటున్నారు.
ఎలాంటి ఆకుకూరలు అయినా శుభ్రంగా కడిగిన తరువాతే వాటిని వండుకోవాలి. అలా చేయకపోతే శరీరంలోకి డస్ట్ ఎంటర్ అవుతుంది దాంతో స్టోన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా కిడ్నీలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.