Feeding Cow : చాలా మంది పెళ్లి అవ్వక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వయస్సు పైబడిపోయినా, ఉద్యోగం వచ్చి చాలా కాలం అయినా పెళ్లి అవ్వక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఈ రోజుల్లో 30 దాటిందంటే పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతోంది. బట్టతల రావడం, పొట్ట.. వయసుకి బోనస్ గా వస్తున్నాయి. దాంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. పెళ్లి అస్సలు ఆలస్యం అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరిగిపోవాలి. లేకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బందే తప్ప మంచి ఏమీ జరగదు.
కొంత మంది పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి కుదరక పోవడంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరైతే ఎంతో మంది దేవుళ్ళని మొక్కుతారు. ఎన్నో ఆలయాలకు వెళ్తుంటారు. అయినా కూడా ఒక్కో సారి ఫలితం కనబడదు. పెళ్లి అవ్వని వాళ్ళు గోమాతకి కొన్ని ఆహార పదార్థాలని తినిపిస్తే, త్వరలో పెళ్లి అవుతుందట.
మరి ఇక ఆ విషయాలని చూసేద్దాం. మనం గోవుని పూజిస్తాం. గోవు పవిత్రతకి, శుభానికి చిహ్నం. ఉదయాన్నే ఆవుని చూసి నిద్రలేస్తే శుభ శకునంగా భావిస్తారు. గోవు సకల దేవతా స్వరూపం. సమస్త దేవతలు అందరూ కూడా గోవులో ఉంటారు.
గోమాతకి టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకి కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకి వెళ్లి కానీ వెళ్లి గోవులకి మీరు టమాటాలని పెట్టొచ్చు. ఇలా ఆవుకి టమాటాలను పెట్టడం వలన త్వరలో పెళ్లి కుదురుతుంది. కాబట్టి ఎంతకీ పెళ్లి కాక సతమతమయ్యే వాళ్ళు ఆవుకి ఇలా పెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కవచ్చు. టమాటాలని ఆవుకి పెట్టడం వలన కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది.