ప్రతి ఒక్కరూ కూడా లైఫ్ బాగుండాలని ఆనందంగా జీవించాలని అనుకుంటుంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో కొన్ని విషయాలని పాటిస్తూ ఉంటారు. కొన్ని సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి. ఈ జీవిత సత్యాలు కచ్చితంగా మీరు తెలుసుకుని తీరాలి. మరి ఇక అవి ఏంటో చూసేయండి.. ఏది కొనాలన్నా ఎవరికి తెలియకుండా కొనాలి. మీ ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేసుకోకండి అలా చేస్తే మీరే బాధ పడాల్సి వస్తుంది.
బహిరంగంగా అవమానించబడుతున్నట్లయితే తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోండి. మీరు మీ అవమానాన్ని ప్రచారం చేస్తే చాలా మంది మిమ్మల్ని అవమానించడం మొదలు పెడతారు. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు వీలైనంతవరకు దాన్ని రహస్యంగా ఉంచాలి. మీ ఆనందాన్ని శాంతితో సెలబ్రేట్ చేసుకోండి. యోగ గురువు నుండి దీక్ష తీసుకున్నట్లయితే అతను ఇచ్చిన గురువు మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి అది మీకు మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది.
మీరు ఏమైనా మందులను ఉపయోగిస్తున్నట్లయితే రహస్యంగా ఉంచండి రహస్యంగా ఉన్నంతవరకు అది ప్రభావం చూపుతుంది. కారణాలు లేకుండా ఎవరైనా మీ వయసు ని అడుగుతున్నట్లయితే అస్సలు చెప్పొద్దు. దేనినైనా మీరు దానం చేస్తున్నట్లయితే దానిని రహస్యంగా ఉంచాలి అప్పుడు దాని ప్రయోజనం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న ఆనందాన్ని బాధల్ని ఎవరికీ చెప్పకండి. వీలైనంత వరకు రహస్యంగా ఉండేలా చూసుకోండి.