సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. అయితే నవగ్రహాలను పూజించేవారు నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణలు చేయడం మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా మరికొందరు వారి జాతక దోషాల రీత్యా కొన్నిసార్లు ఒక్కో గ్రహానికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజలు చేసినప్పుడు దోష పరిహారం అవుతుంది. అయితే ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం.
నవ గ్రహాలకు అధిపతి సూర్య గ్రహానికి 10 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందాలనుకునేవారు చంద్రుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. బుద్ధి, వికాసం, జ్ఞానం సిరి సంపదల కోసం మనం బుధుడుకి 5, 12, 23 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.
గురు గ్రహానికి 3, 12, 21 ప్రదక్షిణలు చేయాలి. ఇక శుక్రగ్రహం ఆకర్షించే గ్రహం కనుక శుక్ర గ్రహానికి 6 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శని గ్రహానికి 8 ప్రదక్షిణలు చేయాలి. ధైర్య సాహసాలను పెంపొందించుకోవడం కోసం రాహు గ్రహానికి 4 సార్లు, అదే విధంగా మనకు వంశాభివృద్ధి కలగాలంటే కేతు గ్రహానికి 9 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా నవగ్రహ దోష పరిహారం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.