Fat : అధిక బరువును తగ్గించుకోవాలంటే నిత్యం సరైన పౌష్టికాహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం ఎంత ముఖ్యమో, రోజూ కొంత సమయం పాటు వ్యాయామం చేయడం కూడా అవసరమే. అప్పుడే శరీరంలో ఉన్న కొవ్వు కరువుగుతుంది. తద్వారా కండరాలు దృఢంగా మారుతాయి. బరువు తగ్గుతారు. దీంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే అధిక బరువు తగ్గాలంటే వీటితోపాటు మనం తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీర బరువును ఎలాగైతే పెంచుతాయో, కొన్ని మాత్రం అందుకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంటే అవి మన శరీర బరువును తగ్గిస్తాయి. ఈ క్రమంలో అలా శరీర బరువును తగ్గించి ఫ్యాట్ మెకానిజంను ప్రారంభించే ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రేప్ ఫ్రూట్ పండ్లు శరీర మెటబాలిజం ప్రక్రియను పెంచుతాయి. ఫ్యాట్‌ను కరిగిస్తాయి. నిత్యం 2 గ్రేప్ ఫ్రూట్లను ఉదయాన్నే తింటే చాలు. దాంతో ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. తద్వారా కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. శరీర మెటబాలిజం ప్రక్రియను పెంచి కొవ్వును కరిగించడంలో తేనె కూడా చక్కగా ఉపయోగపడుతుంది. నిత్యం తేనెను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేయడానికి 30 నిమిషాల ముందు కనీసం 100 ఎంఎల్ నీటిని తాగాలి. ఇలా తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
గోధుమ, జొన్నలు, రాగులు వంటి ధాన్యాలతో చేసిన బ్రెడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు కూడా తగ్గుతారు. వెనిగర్‌ను నిత్యం భోజనంలో ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. దీంతో ఇన్సులిన్ స్థాయిలు సాధారణ స్థితిలో ఉంటాయి. అప్పుడు బరువు పెరగరు. దీనికి తోడు అప్పటికే శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. శరీర మెటబాలిజం ప్రక్రియను పెంచి కొవ్వును కరిగించే గుణాలు గ్రీన్ టీలో ఉన్నాయి. రోజూ గ్రీన్ టీ తాగుతుంటే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గవచ్చు. కారం, పసుపులను మనం వంటకాల్లో ఎక్కువగా వాడాలి. ఇలా వాడితే వాటిలో ఉండే ఔషధ గుణాలు కార్బొహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తాయి. శరీరం వాటిని త్వరగా శోషించుకోకుండా చూస్తాయి. దీంతోపాటు కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.
రోజంతా ప్రతి 10 – 15 నిమిషాలకు ఒకసారి గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తాగుతుంటే కొవ్వు కరిగించే హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తినాలి. దీని వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. కొవ్వు ఎక్కువగా శరీరంలోకి చేరదు. ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. నిత్యం బీట్‌రూట్‌ను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్లు యాక్టివేట్ అయి కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు.