సాధారణంగా మంగళవారం ఆంజనేయ స్వామికి, మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు. మంగళవారం వీరికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. అదేవిధంగా మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేవడం వల్ల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. సాధారణంగా కుబేరుడు ధనానికి అధిపతి. కనుక కుబేరుడికి పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు.
మంగళవారం కుబేరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మన ఇంట్లో కుబేరుడిని ఉత్తర దిక్కున పెట్టి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఉత్తర దిక్కును కుబేర స్థానం అని చెబుతారు. కనుక ఉత్తరం దిక్కున కుబేరుడి విగ్రహాన్ని పెట్టి పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
కుబేరుడి విగ్రహం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారం చేసేచోట లేదా ఆఫీసులో పెట్టడం వల్ల వారికి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నిద్ర లేచేటప్పుడు కుబేర స్థానాన్ని చూసి నిద్ర లేవడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. పడుకునేటప్పుడు దక్షిణ దిశ వైపు తలపెట్టి పడుకోవడం వల్ల లేవగానే మనం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేవవచ్చు. దీంతో రోజంతా శుభమే కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.