Inguva : చాలామంది వంటల్లో ఇంగువని వాడుతూ ఉంటారు. ఇంగువని తీసుకోవడం వలన చాలా లాభాలని పొందవచ్చు. ఇంగువతో చాలా రకాల సమస్యలకి దూరంగా ఉండవచ్చు. మనం కొన్ని కూరల్లో, పులిహోర వంటి వాటిలో కచ్చితంగా ఇంగువ వేసుకుంటూ ఉంటాము. ఇంగువ వంటకి మంచి రుచిని ఇస్తుంది. అలాగే మంచి సువాసనని కూడా ఇస్తుంది. అయితే ఈ రెండు లాభాలే కాదు, ఇంగువని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరి ఇక ఇంగువ తీసుకోవడం వలన ఎలాంటి లాభాలని పొందవచ్చు..?, రోజూ ఇంగువ తీసుకుంటే ఏమవుతుంది.. అనే విషయాలను తెలుసుకుందాం.
ఇంగువని తీసుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఉన్నాయి. శరీరంలో పలు సమస్యలని తరిమి కొట్టడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. శరీరంలో రక్తం గడ్డలు కట్టకుండా నిరోధిస్తుంది. ఇంగువని తీసుకోవడం వలన రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదం కూడా ఉండదు. ఇంగువని తీసుకోవడం వలన ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా ఉండవు. క్రమం తప్పకుండా ఇంగువని వంటల్లో వేసుకోవడం వలన కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంగువతో శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటీస్ వంటి శ్వాస కోస సమస్యలకి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
ఛాతి బిగుతు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది ఇంగువ. ప్రతిరోజు ఇంగువ పొడి కలిపిన నీళ్లను తీసుకుంటే, చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. అర గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు ఇంగువ పొడి వేసి తీసుకుంటే మంచిది. లేదంటే రోజూ వంటల్లో వేసుకున్నా సరిపోతుంది.