Hibiscus For Hair : మందారం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. మందారం తో చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జుట్టు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా మందారం బాగా ఉపయోగపడుతుంది. కురులు అందంగా మారడానికి, కురులు ఒత్తుగా, బలంగా మారడానికి కూడా మందారం బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం కూడా, మందారం తో తగ్గుతుంది.
మందారంలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. చుండ్రు, దురద వంటి బాధల్ని కూడా మందారం పోగొడుతుంది. ఇక మందారం వలన ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాన్ని, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మందారం తో చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు. మందారం ని వాడడం వలన చక్కటి లాభం ఉంటుంది. ముఖ్యంగా మందారంలో నాచురల్ కలర్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి.
మెలనిన్ ఉత్పత్తి అయ్యేటట్టు, ఇది చేస్తుంది. తెల్లబడిన జుట్టుని నల్లగా మార్చడానికి మందారం బాగా ఉపయోగపడుతుంది. మందారాన్ని ఉపయోగిస్తే, చుండ్రు కూడా బాగా తగ్గుతుంది. మందారం ని వాడడం వలన, జుట్టు దృఢంగా పెరుగుతుంది. అలానే, ఆరోగ్యంగా ఉంటుంది. మందారం నూనె, మందారం పొడి వంటివి ఉపయోగిస్తే, జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
ఆరోగ్యంగా, ఒత్తుగా జుట్టు ఎదుగుతుంది. కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. మందారం ని వాడడం వలన బట్టతల సమస్య నుండి కూడా, ఈజీగా బయటపడొచ్చు. మందారం తో ఒత్తైన జుట్టుని పొందవచ్చు. ఇలా, అనేక రకాల లాభాలని మందారం తో పొందవచ్చు. కనుక, చాలా రకాల ప్రొడక్ట్స్ లో మందారాన్ని వాడుతూ ఉంటారు. మందారం వలన అనేక లాభాలు వున్నాయి. ఆయుర్వేదము లో కూడా మందారాన్ని విరివిగా వాడుతూ ఉంటారు. మందారం పూలని పూజకి ఉపయోగిస్తే, శుభం కలుగుతుంది. ముఖ్యంగా, ఎర్ర మందారం పూలతో పూజ చేస్తే, మంచి జరుగుతుంది.