సోంపు గింజలను సహజంగానే చాలా మంది సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తుంటారు. భోజనం చేసిన అనంతరం చాలా మంది సోంపు గింజలను తింటుంటారు. దీంతో నోరు తాజాగా మారడమే కాకుండా నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే సోంపు గింజలతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
సోంపు గింజలు చక్కని వాసనను, రుచిని కలిగి ఉంటాయి. అందువల్ల కొందరు వీటిని వివిధ రకాల కూరలు, పచ్చళ్లు, స్వీట్ల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. సోంపు గింజలను సరిగ్గా ఉపయోగించాలే గానీ అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవచ్చు. అలాగే పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలను బయటకు పంపడంలో సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటి వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. సోంపు గింజలతో తయారు చేసే నీళ్లను తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు.
సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మనం తినే ఆహారాల్లో ఉండే విటమిన్లు, మినరల్స్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. సోంపు గింజల నీళ్లను రోజూ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. ఈ నీళ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత, సాయంత్రం స్నాక్స్ సమయంలోనూ ఒక కప్పు మోతాదు చొప్పున తాగుతుండాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
సోంపు గింజల నీళ్లను ఇలా తయారు చేయవచ్చు. ఒక జగ్ తీసుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లను పోయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను వేసి నానబెట్టాలి. పావు టీస్పూన్ పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఆ నీళ్లను రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం అందులో ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేసి తాగాలి. ఇంకో గ్లాస్ నీటిని సాయంత్రం వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు.
నాలుగు టేబుల్ స్పూన్ల సోంపు గింజలు, రెండు టేబుల్ స్పూన్ల వాము, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక టీస్పూన్ మెంతులను పెనంపై వేయించి వాటిని పొడిలా చేసి కలపాలి. ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తాగుతుండాలి. ఇలా కూడా సోంపు గింజలను తీసుకోవచ్చు.
సోంపు గింజలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. అందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఇలా చేసినా అధిక బరువు తగ్గుతారు. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.