Allu Arjun : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ బన్నీ దెబ్బకో లేక వారి దురదృష్టమో తెలియదు గానీ.. ఆ హీరోయిన్లు ఎవ్వరూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్లు ఎవరు..? వాళ్లు బన్నీ బ్యాడ్ సెంటిమెంట్ దెబ్బతో ఇండస్ట్రీ నుంచి ఎలా కనుమరగయ్యారో చూద్దాం.
బన్నీ ఫస్ట్ మూవీ గంగోత్రితో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది దివంగత తార ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్. ఈ సినిమా హిట్ అయినా.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది. అల్లు అర్జున్ వివి. వినాయక్ కాంబినేషన్లో వచ్చిన బన్నీ సినిమాతో గౌరీ ముంజల్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో గౌరి సినిమాతోపాటు కన్నడ, మళయాళంలో కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక త్వరగా ఫేడవుడ్ అయిపోయింది.
బన్నీ రెండో సినిమా ఆర్యలో అనురాధ మెహతా హీరోయిన్ గా నటించింది. బన్నీ సక్సెస్ సాధించినా అనురాధ మెహతా కెరీర్ కు ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు. అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన వరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి భాను శ్రీ మెహ్రా పరిచయమయ్యింది. ఈ హీరోయిన్ కు వరుడు మూవీ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పరుగు సినిమాతో షీలా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమా చేసింది.
అయితే ఆమెకు ఎందుకో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ వచ్చినా నిలదొక్కుకోలేకపోయింది. బన్నీ – క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాతో దీక్షా సేథ్ ఆ తర్వాత గోపీచంద్, మనోజ్ లాంటి హీరోల పక్కన నటించినా సక్సెస్ కాలేదు. అందం ఉన్నా కూడా దీక్ష నిలదొక్కుకోలేదు. ఏదేమైనా బన్నీ హీరోగా సూపర్ సక్సెస్ అయినా ఆయన సినిమాలతో పరిచయమైన హీరోయిన్లకు మాత్రం వరుస షాకులు తగిలి ఇండస్ట్రీని వదిలిపోయారు.