Pasupu Kumkuma : ఈరోజుల్లో సాంప్రదాయాలు మారిపోతున్నాయి. పూర్వికులు పాటించే పద్ధతుల్ని చాలా మంది పాటించడం మానేశారు. మనం మర్చిపోతున్న, కొన్ని సనాతన సంప్రదాయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మంగళవారం నాడు పుట్టింటి నుండి కూతురు అత్తింటికి వెళ్ళకూడదు. ఒంటి కాలు మీద ఎప్పుడూ నిలబడకూడదు. సోమవారం నాడు తలకి అస్సలు నూనె రాసుకోకూడదు. శుక్రవారం నాడు కోడలిని పుట్టింటికి పంపకూడదు.
మధ్యాహ్నం కూడా తులసి ఆకులని కోయకూడదు. సూర్యాస్తమయం అయ్యాక ఇల్లు తుడవకూడదు. తల దువ్వుకోకూడదు. పెరుగు, ఉప్పుని అప్పు కింద ఎవరికి ఇవ్వకూడదు. ఇంట్లో గోళ్ళని కత్తిరించకూడదు. వేడి అన్నంలో పెరుగు వేయకూడదు. భోజనం మధ్యలో ఎప్పుడు లేవకూడదు. గడప మీద కాలు పెట్టకూడదు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కాసేపు కూర్చోకూడదు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడ్చకూడదు. రాత్రిపూట బట్టలు ఉతకకూడదు.
గోడలకి పాదం ఆనించి పడుకోకూడదు. విరిగిన గాజులను వేసుకోకూడదు. నిద్ర లేచాక వెంటనే పడుకున్న చాపని మడిచి వేసేయాలి. ఒంటి అరిటాకును తీసుకురాకూడదు. అన్నదమ్ముడు, తండ్రి ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. కాళ్లు కడిగేటప్పుడు మడమలను మరచిపోకూడదు. చేతులు కడుక్కున్నాక జాడించకూడదు. తిన్న వెంటనే నిద్రపోకూడదు. ఎంగిలి చేతితో వడ్డించకూడదు. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడుక్కోకూడదు.
ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి, ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపకూడదు. ఒకరు వేసుకున్న దుస్తులు, ఆభరణాలు ఇంకొకళ్ళు వేసుకోకూడదు. చిన్న జంతువులకి పాచిపోయిన ఆహార పదార్థాలని పెట్టకూడదు. దేవాలయంలో చెప్పులు పోతే మరిచిపోవాలి. ఇంకొకరి చెప్పులు వేసుకుంటే దరిద్రం మీ ఇంటికి వస్తుంది. ఇంట్లో వాడకుండా పడి ఉన్న గోడ గడియారాలని, వాచీలని, సైకిల్ ని కుట్టు మిషన్లని అస్సలు పెట్టుకోకూడదు. అనవసరంగా కొత్త చెప్పులు కొనుక్కోకూడదు. శనివారం నాడు ఉప్పు, నూనె కొనకూడదు. ఇతరులని అనవసరంగా విమర్శించకూడదు.