Boiled Lemon Water : చాలా మంది నిమ్మకాయలని వాడుతూ ఉంటారు. నిమ్మలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. నిమ్మకాయ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. చాలామంది నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు. చల్లని లేదా సాధారణ నీటికి బదులుగా కొంత మంది వెచ్చని నీళ్ళని, నిమ్మరసం తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. నిమ్మరసంలో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, చక్కెర తక్కువగా ఉంటాయి.
పొటాషియం, ఫోలేట్, విటమిన్స్ కూడా బాగా ఉంటాయి. ప్రతి గ్లాసు నిమ్మ రసంలో పోషక విలువలు వేసిన నిమ్మరసం బట్టి, దానిలో వేసిన పదార్థాలను బట్టి ఉంటుంది. నిమ్మ రసం తీసుకునేటప్పుడు వయసును బట్టి కూడా తీసుకోవాలి. నిమ్మ రసం తీసుకోవడం వలన చర్మ పరిస్థితి మెరుగుపడుతుంది. వృద్ధాప్యం, ఫైన్ లైన్స్, మొటిమలు వంటివి తగ్గుతాయి. నిమ్మ రసం తీసుకుంటే రక్త పోటు తగ్గుతుంది.
ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం రెండూ కూడా రక్తపోటుని తగ్గించేందుకు సహాయ పడతాయి. నిమ్మరసంతో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. నిమ్మరసాన్ని తీసుకోవడం వలన జీర్ణక్రియని మెరుగు పరచుకోవచ్చు. అయితే నీళ్లు తీసుకునేటప్పుడు కొంచెం గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వలన జీవక్రియలని వేగవంతం చేయొచ్చు.
అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. మీరు మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. ముందు నిమ్మ రసాన్ని పిండి ఒక గ్లాసు వేడి నీటిలో ఆ నిమ్మరసం కలపండి. ఆ తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మీరు తీసుకోవచ్చు. కావాలంటే పైన మళ్ళీ కొన్ని నిమ్మకాయలని ముక్కలు కింద కట్ చేసి వేసుకోవచ్చు. ఇది ఒక పద్దతి. ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు నిమ్మ రసంని తీసుకోవచ్చు.