శివ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక కల్ట్ క్లాసిక్‌గా ఇప్పటికి గుర్తుంటుంది మరియు ఇది అనేక చిత్రాలకు థీసిస్ గా నిలిచింది. ఈ సినిమా నాగార్జునని టాలీవుడ్‌లో స్టార్‌గా కూడా నిలబెట్టింది. శివ సినిమా కాలేజీలో జరిగే గొడవల నేపథ్యంలో తెరకెక్కింది. అప్పటిలో చైన్ ఫైట్ లు కూడా ఈ సినిమాతోనే మొదలయ్యాయి. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన కొన్ని రికార్డులను ఇప్పటికీ ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోతుంది. ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ కూడా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు వచ్చింది.
ఆర్జీవీ కలెక్టర్ గారి అబ్బాయి, రావుగారిల్లు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ సమయంలోనే నాగార్జునతో వర్మకు పరిచయం ఏర్పడింది. ఆ తరవాత రాత్రి అనే కథను నాగార్జునకు వినిపించాడు. కానీ ఆర్జీవీ చెప్పిన కథ నాగార్జునను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరవాత ఆర్జీవీ తన కాలేజీ రోజుల నుండి ఒక కథను తయారుచేశాడు. ఆ కథను నాగార్జునకు వినిపించడం జరిగింది. స్టోరీ భాగా నచ్చడంతో వెంటనే నాగార్జున కూడా చిత్ర కథకు ఓకే చెప్పేశారు. ఇక ఇదే కథను తనికెళ్లబరణికి కూడా వినిపించారు వర్మ.
ఈ కథ విన్న తనికెళ్లభరణి కూడా మొదట ఆశ్చర్యపోయారట. అప్పటికే కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన తనికెళ్లభరణిని శివ సినిమాకు కూడా డైలాగులు రాయమన్నారు. దాంతో భరణి కథను బట్టి కొన్ని కామెడీ డైలాగులను కూడా జత చేయడం జరిగిందట. కానీ వర్మ ఈ కథలో ఒక్క కామెడీ సీన్ కూడా ఉండదని చెప్పారట. వర్మ మాటలు విన్న తనికెళ్లభరణి ఈ సినిమా ఆడినట్టే అని మనసులో అనుకున్నారట. అంతే కాకుండా వర్మ గురించి వీడికేమైనా పిచ్చా అని కూడా అనుకున్నారట. కానీ ఆర్జీవి కోరినట్టుగా మాటలు రాసి ఇచ్చారట తనికెళ్ల భరణి.
ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా అమలని హీరోయిన్ గా అనుకున్నారు. ఇక విలన్ పాత్ర కోసం రఘువరుణ్ ను తీసుకున్నారు. భవాని అనే పాత్రలో రఘువరణ్ నటనకు వీక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి చేసుకుంది. సినిమా రీరికార్డింగ్ కు ముందు చూసిన నిర్మాతలు కూడా సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నారట. అంతేకాకుండా టైటిల్ విషయంలో కూడా పెదవివిరిసారట. అలా తెరకెక్కిన శివ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ 1989 వ సంవత్సరంలో విడుదలై ఆల్ టైం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.