Aloe Vera For Vastu : కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కలబందతో, అనేక ఉపయోగాలని మనం పొందవచ్చు. అందాన్ని పెంపొందించుకోవడానికి కూడా, కలబంద బాగా ఉపయోగ పడుతుంది. అయితే, అందం, ఆరోగ్యం మాత్రమే కాదు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి కూడా, కలబంద బాగా ఉపయోగపడుతుంది. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. కలబంద మొక్క ఇంట్లో ఉండడం వలన, నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే, అదృష్టం కూడా వస్తుంది.
కలబంద మొక్క ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంటే, ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అనేది చూద్దాం. కలబంద మొక్కని ఇంట్లో పెంచే వాళ్ళు, సూర్యరష్మి బాగా ఉండే ప్రదేశంలో పెంచాలి. కిటికీల సమీపంలో లేదంటే షెల్ఫ్ వంటి వాటి చోట పెట్టొచ్చు. కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కలబంద మొక్కని మీరు వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు. బెడ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండు చోట్ల పెట్టేటప్పుడు సూర్యకాంతి బాగా తగిలేటట్టు చూసుకోండి.
కలబంద మొక్కని మనం ఇంటి లోపల పెట్టుకుంటే ఇంకా మంచిది. చాలామంది, పెరట్లో నాటుతూ ఉంటారు. కానీ, ఇంటి లోపల పెడితే ఇంకా మంచిది. ఈ కలబంద మొక్కల్ని తూర్పు లేదా ఉత్తరం వైపు పెడితే ఉత్తమ ఫలితాలని పొందవచ్చు. కలబంద మొక్కని ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఇంట్లో పెట్టేటప్పుడు బాత్రూం కి దగ్గరగా పెట్టకూడదు.
ఎందుకంటే కిటికీలు సరిగ్గా అక్కడ ఉండవు. లోపలికి వెల్తురు కూడా రాదు. తేమ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి, ఈ ప్రదేశాల్లో మొక్క పెరగదు కాబట్టి, ఈ తప్పును చేయొద్దు. ఇలా, మీరు కలబంద మొక్కని ఇక్కడ చెప్పినట్లు పెంచినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు.