ప్రతి ఒక్కరు కూడా మంచి వాటిని అలవాటు చూసుకుంటూ ఉండాలి. మనం రోజూ మంచి అలవాట్లని పాటించామంటే, ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. అలానే మంచిగా అభివృద్ధి చెందొచ్చు. రోజూ ఉదయం 4:30 కి నిద్ర లేస్తే మంచిది. రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకుంటూ ఉండాలి. నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఉదయం 8:30 లోపు కచ్చితంగా తినేయాలి. మధ్యాహ్నం లోగా రెండు నుండి మూడు గ్లాసులు మంచినీళ్లు తాగాలి. మంచినీళ్లు భోజనానికి 48 నిమిషాల ముందు తాగితే మంచిది.
భోజనాన్ని తినేటప్పుడు కింద కూర్చుని తింటే మంచిది. వండిన ఆహార పదార్థాలను వేడిగా 40 నిమిషాల్లోగా తినేయాలి. మధ్యాహ్నం 12 నుండి 1:15 నిమిషాల్లోపు ఆహారాన్ని తినేస్తే మంచిది. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి. మధ్యాహ్నం కూరల్లో వాముపొడి వేసుకుంటే మంచిది. అజీర్తి సమస్యలు వుండవు. మధ్యాహ్నం భోజనం ఫుల్లుగా తినేయాలి. భోజనం తిన్నాక మధ్యాహ్నం మజ్జిగ తాగితే మంచిది.
తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. మూడు గంటల సమయంలో టీ తాగితే మంచిది. నాలుగు గంటలకి ఏదైనా సలాడ్ తీసుకోండి. రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు తినేయాలి. రాత్రి భోజనం అయ్యాక పాలు తాగితే మంచిది. రాత్రిపూట లస్సీ, మజ్జిగ తీసుకోవద్దు. రాత్రి నాలుకను శుభ్రంగా కడుక్కోవాలి. కొబ్బరినీళ్ళని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
పాలల్లో పసుపు వేసుకొని తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. చలికాలంలో వెండి పాత్రలో నీళ్లు తాగితే మంచిది. వానాకాలంలో రాగి పాత్రలో నీళ్లు తాగాలి. శరీరంలో ఉన్న వేడి పోవాలంటే సబ్జా గింజలని నీళ్లల్లో వేసుకుని తీసుకోవడం మంచిది. ఎండాకాలంలో చికెన్ తినకూడదు. సాయంత్రం సమయంలో కాళ్లపై కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది.