Cucumber In Winter Season : కీర దోసకాయ, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలి కాలంలో వచ్చే, ఆహారాలని తీసుకోవడం వలన ఆ సీజన్ లో వచ్చే సమస్యల నుండి, దూరంగా ఉండొచ్చు. కీరా దోసను తీసుకోవడం వలన, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. కీరా మొక్కలు, కాయ, వేర్లు కూడా ఔషధంగా పనిచేస్తాయి. కీరదోసని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. తక్కువ ధరకే, మనకి కీరదోస లభిస్తుంది. కీరదోసలో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇందులో కాపర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి తో పాటుగా ఫాస్ఫరస్, మెగ్నీషియం, బయోటిన్, విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి.
కీరదోసలో 95% నీళ్లు ఉంటాయి. కనుక కీరదోసను తీసుకోవడం వలన, డిహైడ్రేషన్ సమస్య అసలు ఉండదు. కీరదోస శరీరంలో వ్యర్థాలని, ఈజీగా బయటకి పంపిస్తుంది. కీరదోస లో ఉన్న లవణాలు, గోళ్లు చెట్లిపోకుండా చూస్తుంది. కళ్ళు అలసట కి గురైనట్లయితే, కీర దోసకాయ ముక్కలని చక్రాల కింద కోసుకొని, కళ్ళ మీద పెట్టుకుంటే, అలసట తగ్గుతుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.
కంటికింద వాపు వంటివి కూడా బాగా తగ్గిపోతాయి. కీరదోసను తీసుకోవడం వలన ఇలా చాలా లాభాలు ఉంటాయి. ఇందులో నీటి శాతం ఎక్కువ ఉండడం వలన, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, చాలా మంచి ఫలితం ఉంటుంది. కీర దోసతో కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి.
బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి కూడా, ఇది సహాయం చేస్తుంది. హై బీపీ లో బీపీ రెండిటిని కూడా కంట్రోల్ చేయగలదు. అంతేకాకుండా క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు కూడా, కీరాలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే, చక్కటి గుణాలు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడగలదు.