మన హిందువులు ఎన్నో ఆచారాలతో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. మన ఇల్లు నిర్మించే సమయం నుంచి ఇంట్లో అలంకరించుకుని ప్రతి వస్తువు వరకు వాస్తు ప్రకారం అలంకరించుకుంటారు. అదేవిధంగా మన ఇంటి ఆవరణంలో ఉండే చెట్లను సైతం వాస్తుశాస్త్రం ప్రకారమే నాటుతారు.ఈ క్రమంలోనే కొన్ని రకాల చెట్లు మన ఇంటి ఆవరణంలో కానీ మన ఇంటి పరిసర ప్రాంతాలలో కానీ ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైనటువంటి చెట్లలో చింత చెట్టు మన ఇంటి ఆవరణంలో అస్సలు ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
చింత చెట్టు మన ఇంటి ఆవరణంలో ఉంచటం వల్ల మన కుటుంబ సభ్యులు వ్యాధులకు గురి అవుతారని, అదేవిధంగా మన ఇంట్లో సంబంధాలు కూడా క్షీణిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చింత చెట్టు ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల మన ఇంట్లో ప్రతికూల పరిస్థితి అధికంగా ఉండి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
ఈ క్రమంలోనే తాటి చెట్లు సైతం మన ఇంటి ఆవరణంలో ఉండకూడదు. తాటి చెట్టు ఇంటికి అందాన్ని తెచ్చినప్పటికీ,వాస్తు ప్రకారం తాటి చెట్టు కుటుంబ సభ్యుల పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. కేవలం ఈ చెట్లు మాత్రమే కాకుండా ముళ్లు కలిగినటువంటి చెట్లు,పాలు కారే చెట్లు కూడా మన ఇంటి ఆవరణంలో పెంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.