Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chicken Curry : బ‌గారా రైస్‌లోకి చికెన్ క‌ర్రీని ఇలా చాలా సింపుల్‌గా చేసేయండి..!

Admin by Admin
December 24, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chicken Curry : చికెన్ క‌ర్రీ.. మ‌న‌లో చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ‌గా వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో చికెన్ క‌ర్రీని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే దీనిని ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా బ‌గారా అన్నంలోకి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా తేలిక‌గా చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి…. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ట‌మాట – 1, జీడిప‌ప్పు – 10, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన ఉల్లిపాయ – పెద్దది ఒక‌టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చికెన్ – అర‌కిలో, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 3 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్గ‌రం మసాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

how to make chicken curry for bagara rice

చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..ముందుగా జార్ లో ట‌మాట‌, జీడిప‌ప్పు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, యాల‌కులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత టమాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్, క‌రివేపాకు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ ను నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌లపాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌లిపి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chicken Curry
Previous Post

Vitamin K Benefits : గుండె జ‌బ్బులు రాకుండా చేసే విట‌మిన్ ఇది.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Next Post

Old Currency Notes : మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.5 నోటు ఉందా ? అయితే రూ.30వేలు వ‌స్తాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!