చాలా దేశాల్లో టాయిలెట్ పేపర్‌కి బదులు ఇతర పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు భారతదేశం వంటి దేశాలలో టాయిలెట్ పేపర్ అస్సలు వాడరు. నీటితోనే అన్ని పనులు కానిచ్చేస్తారు. ఇక మిగతా దేశాల ప్రజలు మాత్రం.. వైట్ టాయిలెట్ పేపర్ ను వాడుతారు. అయితే.. మన ఇండియన్స్ టాయిలెట్ పేపర్ వాడకపోవడానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…
1. ఇది చికాకు కలిగించవచ్చు
బాత్రూంలలో వైట్ టాయిలెట్ పేపర్ వాడితే.. కొంత మందికి చికాకు కలిగిస్తుంది. నీళ్లు వాడితేనే వారు సంతృప్తి చెందుతారు.
2. యూరినరీ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు
బాత్రూంలలో వైట్ టాయిలెట్ పేపర్ వాడితే.. చాలా మందికి యూరినరీ ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఆ వైట్ పేపర్.. మన శరీరానికి తాకడం వల్ల.. రాపిడి జరిగి.. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకు ఇండియన్స్ టాయిలెట్ పేపర్ వాడరు.
3. ఇది పర్యావరణానికి విరుద్దం
నిపుణుల అంచనాల ప్రకారం, USAలో మాత్రమే, ప్రతి సంవత్సరం 36.5 బిలియన్ రోల్స్ టాయిలెట్ పేపర్‌ను ఉపయోగిస్తున్నారు, ఇది దాదాపు 15 మిలియన్ చెట్ల గుజ్జును సూచిస్తుంది. ఈ టాయిలెట్ పేపర్ కోసం అన్ని చెట్లను నరకడం పర్యావరణానికి విరుద్దం కనుక.
4. సాంప్రదాయం
ముస్లిం దేశాలలో, అన్ని సమయాలలో మలవిసర్జన తర్వాత శుభ్రంగా శరీర భాగాలు కడగటం సాంప్రదాయం. భారతదేశంలో కూడా అదే సాంస్కృతి నడుస్తోంది.
5. ఇది పరిశుభ్రమైన పని కాదు.