Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం & ఫిట్‌నెస్

Dengue : డెంగ్యూ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే నివారించవచ్చు..

Editor by Editor
October 11, 2021
in ఆరోగ్యం & ఫిట్‌నెస్, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Dengue : దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ వేగంగా విస్త‌రిస్తోంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండటం, త‌మ‌ కుటుంబాన్ని దాని నుండి సురక్షితంగా ఉంచడం ఆవ‌శ్య‌కం అయింది. డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా దానిని సులభంగా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా చలితో అధిక జ్వరం కలిగి ఉంటే అప్పుడు క‌చ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలో డెంగ్యూ నిర్ధారణ అయినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Dengue is spreading quickly follow these tips to be safe

ఈ సీజన్‌లో ప్రతి సంవత్సరం డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ యుధ్వీర్ సింగ్ చెప్పారు. చాలా మంది రోగులు తేలికపాటి రోగలక్షణాల‌తో ఉంటారు. ఒకటి లేదా రెండు వారాలలో కోలుకుంటారు. కొన్ని సందర్భాల్లో రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది. చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. కాబట్టి ఎవరికైనా డెంగ్యూ వచ్చినట్లయితే వారు జాగ్రత్తగా ఉండాలి.

ఫోర్టిస్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ విభాగానికి చెందిన డాక్టర్ రిచా షారిన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా మంది డెంగ్యూ, మలేరియా రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. ఈ రోగులలో అధిక జ్వరం, వాంతులే, విరేచనాల సమస్యలు కూడా కనిపిస్తున్నాయ‌న్నారు. నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం రోగులకు చికిత్స అందిస్తున్నార‌ని తెలిపారు.

మీకు ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే పరీక్ష‌లు చేయించుకోండి..

సరైన సమయంలో డెంగ్యూ లక్షణాలను గుర్తించి చికిత్స చేయడం ద్వారా ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చని డాక్టర్ రిచా చెప్పారు. ఆ డాక్టర్ ప్రకారం.. డెంగ్యూ లక్షణాలు కింది విధంగా ఉంటాయి.

చలితో అకస్మాత్తుగా అధిక జ్వరం రావ‌డం, కండరాలు, తల, కీళ్లలో నొప్పి, కళ్ల వెనుక నొప్పి, తీవ్ర బలహీనత, ఆకలి కోల్పోవడం, వికారంగా ఉండ‌డం, వాంతులు అవుతుండ‌డం, నోటిలో దుర్వాస‌న, రుచి లేక‌పోవ‌డం.. వంటి ల‌క్ష‌ణాలు డెంగ్యూ వ‌చ్చిన వారిలో క‌నిపిస్తాయి.

నివారణ చర్యలు

ఇంటి లోపల, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండ‌కుంగా చూసుకోవాలి. ముఖ్యంగా కూలర్లు, కుండలు, విరిగిన పాత్రలు, పాత టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండ‌కుండా చూసుకోండి. అలాగే వాటర్ ట్యాంక్, ఇంట్లో నీళ్లు తాగే బిందె, కుండ, ఇత‌ర పాత్ర‌ల‌ను సరిగ్గా కవర్ చేయాలి. మూత‌ల‌ను క‌ప్పి ఉంచాలి. కిటికీ తలుపులపై దోమ‌లు రాకుండా జాలి పెట్టండి.

దోమల నుండి రక్షించడానికి శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. ఫ్రిజ్ దిగువన నీటి సేకరణ ట్రేని ఖాళీ చేస్తూ ఉండాలి. తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తినాలి. నిల్వ ఉంచిన ఆహారం తిన‌రాదు. ఈ విధంగా జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే డెంగ్యూ రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు.

Tags: dengueడెంగ్యూ
Previous Post

Dry Grapes : ఎండు ద్రాక్షను నానబెట్టి తింటే కలిగే ప్రయోజనాలివే..!

Next Post

బరువు తగ్గడానికి చిట్కాలు.. బరువు తగ్గడం ఎలాగో తెలుసుకోండి..!

Related Posts

హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు నిజంగానే ఆహారం అధికంగా తినాలా.. వైద్యులు ఏమంటున్నారు..?

July 8, 2025
హెల్త్ టిప్స్

మైక్రోవేవ్ ఓవెన్ ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను వండ‌కూడ‌దు.. ఎందుకంటే..?

July 8, 2025
హెల్త్ టిప్స్

పీరియ‌డ్స్ సమ‌యంలో మ‌హిళ‌లు ఈ పండ్లు తింటే మంచిది..!

July 8, 2025
హెల్త్ టిప్స్

ఈ మూడు ర‌కాల పండ్ల‌ను తింటే ఎలాంటి రోగాన్న‌యినా ఎదుర్కోవ‌చ్చు..!

July 8, 2025
హెల్త్ టిప్స్

చికెన్, మటన్ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..?

July 7, 2025
హెల్త్ టిప్స్

ప‌సుపు రంగులో ఉండే ఆహారాల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

July 7, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.