మనం తినే ఆహారానికి, ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే.. పలు పోషకాలు శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, రోగాలు వంటివి రాకుండా ఉంటాయి. అయితే పలు రకాల కలర్ ఫుడ్ తీసుకుంటే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా పసుపు రంగులో ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పసుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి, కెరొటినాయిడ్లు, ఫైబర్, లుటిన్, రుటిన్, జియాక్సంతిన్‌లు ఉంటాయి. ఇవి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడంతో పాటు గ్యస్ట్రిక్ వంటి సమస్యలు దూరం అవుతాయి. డయాబెటీస్ ముప్పు ఉన్న వారు కూడా ఈ రంగు ఆహారం మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
పసుపు రంగులో ఉండే ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు ఎ, ఇ ఉంటాయి. ఇది తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అరటి పండ్ల గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజూ అరటి పండు తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. రోగ నిరోధక శక్తితో పాటు, ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగతాయి. ఎముకలు బలపడటంతో పాటు, చర్మ, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.
పసుపు రంగు క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియంట్స్, ఫైబర్, విటమిన్లు సి, కె వంటివి మెండుగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలాగే చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. నిమ్మ కాయతో కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. తరచూ మన ఆహారంలో నిమ్మ రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల రోగ నిరోధక శక్తి, ఎనర్జీ లెవల్స్ అనేవి శరీరంలో పెరుగుతాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు, వైరస్‌లు, బ్యాక్టీరియా రాకుండా పోరాడుతాయి. అలాగే చర్మ, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.