సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. మొదట ప్రేమించి పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత విడిపోవడం ఓ పనిగా అలవాటు చేసుకున్నారు సినీ తారలు. అది హాలీవుడ్ అయిన బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయిన విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం. అయితే… విడాకులు తీసుకున్న పలువురు సినిమా స్టార్ల పై ఓ లుక్కేద్దాం.
1. నాగచైతన్య-సమంత:
నాగచైతన్య-సమంత ల వివాహం 2017 అక్టోబరు 7న జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరు 2021లో విడిపోయారు.
2. సునీత:
ప్రముఖ గాయని సునీతకు తొలిగా కిరణ్ తో వివాహమైంది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు.
3. మంచు మనోజ్:
మంచు మనోజ్- ప్రణతి రెడ్డి లది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. కొన్నాళ్లపాటు కలిసున్న వీరు…విభేదాల కారణంగా విడిపోయారు.
4. సుమంత్:
అక్కినేని హీరో సుమంత్, నటి కీర్తి రెడ్డి లది ప్రేమ వివాహం. అయితే ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న రెండేళ్లు కూడా వారు కలిసి ఉండలేకపోయారు. సుమంత్ తో విడాకులు తీసుకున్న కీర్తి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. సుమంత్ మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు.
5. పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి మూడవ వివాహం చేసుకున్నాడు. అంతకుముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.