అందం విషయంలో మహిళలు ఏమాత్రం రాజీపడరు. అందం అనగానే ముఖం బాగుందా లేదా అనే చూసుకుంటారు. అందం ముఖానికి మాత్రమే పరిమితం కాదు. కాళ్లు, చేతులు, పాదాలు అన్నీ బాగుంటేనే అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. వీటిలో ఒకటైనా సరిగా లేకుంటే మీరు అందంగా లేరని ఒప్పుకోకతప్పుదు. శీతాకాలంలో పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని కోమలంగా, మృదువుగా మార్చేందుకు అరటి మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీ :
బాగా పండిన రెండు అరటిపండ్లను మెత్తగా గుజ్జులా తయారు చేసుకోవాలి. కచ్ఛితంగా పండిన అరటిపండ్లనే తీసుకోవాలి. పచ్చివాటిలో యాసిడ్స్ ఉండడం వల్ల ఇవి చర్మంపై ఉపయోగించడానికి కఠినంగా ఉంటుంది. ఈ మిశ్రమంతో పాదాల మొత్తానికి ఐప్లె చేయాలి. ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి. కాలివేళ్లు, కాలి మడమలు, వేళ్లసందులకు అన్నింటికీ అరటిగుజ్జును ఐప్లె చేయాలి. 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫ్రూట్‌మాస్క్ పద్ధతి ప్రతిరోజూ రాత్రి నిద్రించడానికి ముందు ప్రయత్నించండి. వారానికి కనీసం రెండు వారాలు క్రమం తప్పకుండా అనుసరిస్తుంటే మంచి ఫలితాలను పొందుతారు.
అరటిపండు ఎలా పనిచేస్తుంది?
ఇందులో నేచురల్ స్కిన్ మాయిశ్చరైజర్ ఉంటుంది, అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం గలదు. విటమిన్ ఎ, బి6, సి, పొటాషియంలు ఉండడం వల్ల స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది.
పగిలిన, పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చుతుంది :
పగిలిన, పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చుతుంది. అలాగే అరటితొక్కలోని అమినో యాసిడ్స్ చర్మంను హైడ్రేషన్లో ఉంచుతుంది. పాదాలను మృదువుగా మార్చేస్తాయి. మడమల పగుళ్లకు ఇది తిరుగులేని మంత్రం.