Naresh Net Worth : ఒకప్పుడు హీరోగా అలరించి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నాడు నరేష్. ఇటీవల మనోడు పవిత్ర లోకేష్‌తో సహజీవనం విషయంలో తెగ వార్తలలో నిలుస్తున్నాడు. మంచి కామెడీ టైమింగ్ తో పాటు సీరియస్ క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడంతో నరేష్ కి ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక సినిమాలతో పాటు బిజినెస్‌లు కూడా బిజినెస్‌లు కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. 5 దశాబ్దాలుగా పరిశ్రమను కొనసాగుతున్న నరేష్ కి వందల కోట్ల ఆస్తి ఉందని టాక్ నడుస్తుంది. దిగవంత నటి జయం నిర్మల కొడుకు అయిన ఈయన బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం టీనేజ్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఫేడ్ ఔట్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. ఆయనకి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు.
నరేష్ సినిమాల ద్వారా కూడా బాగానే సంపాదిస్తాడు. ఆయన రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుందని తెలుస్తంది. ఇక తల్లి విజయనిర్మల దగ్గర నుండి ఆయనకి పెద్ద మొత్తంలో ఆస్తులు వచ్చాయట. ఇక నరేష్ స్థిరచర ఆస్తుల విలువ దాదాపుగా వందల కోట్లలో ఉంటుందని సమాచారం. ఇక కృష్ణని దగ్గరుండి చూసుకోవడం వలన అతని ఆస్తిలో కొంత భాగం నరేష్ కే దక్కిందని ఆ మధ్య టాక్ నడిచింది. కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టే నరేష్ అంత విలాసవంతంగా ఉంటున్నాడని కొందరి టాక్. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ కొద్ది రోజులుగా మూడో భార్యతో తెగ ఫైట్ చేస్తున్నాడు.
గతంలో నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమా చేశారు. ఈ చిత్రంలో రియల్ లైఫ్ కపుల్స్ గా ప్రచారం అందుకున్న పవిత్ర లోకేష్ నరేష్ జంటగా స్క్రీన్ పై కనిపిస్తూ సందడి చేశారు.